Wednesday, April 29, 2009

రాయాలని ఉంది!

నందన వనం లో ఎగిరే
రంగురంగుల సీతాకోకచిలుకలా నైతేనేం
కీకారణ్యం లో వేగంగా ఉరికే చిరుత పులిలా నైతేనేం
మనిషి మనస్సులో సదా పరుగులెత్తేకోరికల గురించి రాయాలని ఉంది॥
హేమంతం లో గాలిని నింపే పొగమంచులా నైతేనేం
గడ్డి రేకుల మీద నిలిచిన హిమ బిందువులా నైతేనేం
మనిషి మనసున నిండిన ఆర్ద్రత గురించి రాయాలని ఉంది॥
రాయాలని ఉంది.......
మనిషి ఆశలనూ, భావాలనూ,
చెరిగి పోని జీవిత సత్యాలనూ
నింపుకున్న ఒక శాశ్వతమైన కవిత రాయాలని ఉంది॥

గతచిత్రం

కొన్ని గుర్తుకురావు
కొన్ని మరపుకు రావు
గతాన్ని చీకటి వెలుగుల జల్లెడతో జల్లించి
మనసొక మాయాజలం కల్పిస్తుంది।
నిరుడు రాలిన ఆకులమీద ఏ చిత్రాలు గీసుకున్నదీ ఏ చెట్టు గుర్తుంచుకోదు।
పోయిన పున్నమిరాత్రి ఎగసిన అలల్లోఏయే కోర్కెలు దాచుకున్నదీసముద్రం గుర్తుంచుకోదు।
కాని, మనిషిని మాత్రం ఒక జ్ఞాపకంతుదకంటా వెంటాడుతుంది।
పొరలు పొరలుగా రాల్చిన గత రూపాల్ని అరల్లో దాచిమరల మరల కళ్ళెదుట చూపెడుతుంది।
కలిసి కనుమరుగైన మనుషులు,అంది చేజారిన అవకాశాలు,అపరిపక్వతతో, అమాయకతతోపొంది,
పోగొట్టుకొన్న విలువైన అనుభవాలుకిక్కిరిసిన పలు శకలాలుగా తోచి గతం మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంది।
ఏమీ తెలియని భవిష్యత్తులోనే కాదు,అంతా ముగిసిన గతం లో కూడావింతైన మార్మికత యేదో నిండిఉంటుంది.

Saturday, April 11, 2009

మరువకు నేస్తం......

చెంత ఉన్న కలను కాదనుకుంటే
మన కలలకు అర్థముండదు
తోడు ఉన్న నీడను వదులుకుంటే
మనం నిలిచే చోటుకి విలువ వుండదు
విలువైన వరం స్నేహం ....అలాంటి స్నేహం బ్రమ అనుకుంటే
మన మనసుకి ఆనందం భారమౌతుంది
గుండేకు హత్తుకుపొయే ప్రక్రుతిలా
మనల్ని ప్రతిక్షణం పలకరించే స్నేహితులు దొరకటం కష్టం
అలాంటి స్నేహాన్ని, స్నేహితులను మరువకు నేస్తం......

ఒక ప్రేమికుడి ప్రేమ

నీకు తెలుసా!!!
రాత్రి ప్రపంచం కౌగిలిలో నిద్రిస్తుంటే
హఠ్టాత్తుగా గుర్తుకొస్తావు మెళకువ వస్తుంది....
నా పిచ్చి కానీ నిను విడిచి నా మది ఏనాడు విశ్రమించిందనీ
ప్రేమ ప్రేమిస్తుందే తప్ప ద్వేషించదు
జీవితానికి జీవం పొసేది ప్రేమ
ఉక్కులాంటి హ్రుదయాన్ని కదిలించేది ప్రేమ
చిలిపి కళ్ళ కదలిక ప్రేమ
చెప్పలేని నా మనస్సే ఒక మూగ ప్రేమ
నీ అందమైన నవ్వులతో నా జీవితం ప్రతి రోజూ ప్రారంభం అవ్వాలని కోరుతూ....
ఒక ప్రేమికుడు.....