Sunday, March 30, 2008

దృశ్యం మారదేం????

రోజూ చేస్తున్న అదే పని...
అవే ఉదయాలు , అవే సాయంత్రాలు
అవే హృదయాలు , అవే అనుభూతులు
రోజులు గడుస్తున్నాయ్ , ఋతువులు మారుతున్నయ్
కానీ దృశ్యం మారదేం?????
ప్రతి రోజూ ఉరుకులు పరుగులు
వెక్కిరిస్తూ ట్రాఫిక్ జాం.... లు
చావడానికి బ్రతుకుతున్న మనుషులు
బ్రతకడానికి చస్తున్న మనుషులు
క్రొత్త సంవత్సరాలు వస్తున్నాయ్.....
పాత సంవత్సరాలు పొతున్నయ్....
కానీ దృశ్యం మారదేం????
దృశ్యాన్నిమారుస్తుందని "క్రొత్త"ని అహ్వానిస్తే
మరుక్షణం లో "పాతై" పోయి , నన్ను వెక్కిరిస్తోంది!!!!
వెక్కిరింతలోనైనా నాకు అవగతమౌతుందా???
దృశ్యం ఎప్పటికీ మారదని.....
మార్చాల్సింది నా దృష్టిని అని !!!!!!
ఈ ఉగాదైనా నా దృష్టిని మారుస్తుందని.....ఆశిస్తూ.........

Saturday, March 8, 2008

నేనూ సైనికుడినే

విజ్గ్నానం వేటలో
సౌకర్యాల దాహంలో
ధనసముపార్జనా సమ్మొహనంలో
దూరతీరాలను చేరి
ఉభయసంధ్యల మధ్య
పరుగుపందెంగా మారి
సరిహద్దు గస్తీ సైనికుడి నిరంతర కవాతులా
విరామమెరుగని జీవితం అలసిన క్షణాన
భవిష్యత్తు ప్రణాళికకై నేను ఒక సైనికుడిలా శ్రమిస్తున్నాను......

Friday, March 7, 2008

రాయబారం!!.....

ఆకాశం అందుకోవాలని సాగర కెరటాల ఆరాటం...
దిగంతాల్లో కలుస్తానంటూ ఓక వాగ్దానం
చందమామ సాక్ష్యంగా మిగిలింది
వెన్నెల వెలుగు దారాలతో రాయబారం......

సిరి వెన్నెల కవిత....అహంకారం

నేను శాసిస్తాను కవితని....
భావి కోకిల గొంతునొక్కిన , చిక్కి చిక్కిన వసంతానికి నేను వినిపిస్తాను నా పాటని.....
చక్రవాకపు గొంతులోనికి నేను చిలికిస్తాను స్వాతిని....
చక్రవాకం మోహనంగా ఆలపించిన కళ్యాణిలోనేను వినిపిస్తాను వీణని
నేను వివరిస్తాను "నా వాణి "ని.....

నా బాల్యమా

చిన్న నాటి ఊసులలో ఎంత హయి ఉంది.....అది
తల్చుకున్న కొద్దీ బాధ రగులుతుంది
కరుణలేని కాలప్రభువు ఇంద్రజాలమిది
అదితెలియని హ్రుదయాల ఆవేదన ఇది...
ఓ చిలిపినవ్వు ప్రాయమా ఏమైపోయావు????
నా బాల్యమా....నీవేమైపోయావు॥